ఘనంగా మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు

Nov 10 2026 1:49 AM | Updated on Nov 10 2026 1:49 AM

సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలను లబ్ధిదారులు, కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా నిర్వహించారు. పలువురు లబ్ధిదారులు తమ ఇళ్ల గోడలకు కార్యక్రమానికి సంబంధించిన స్టిక్కర్లు అంటించుకుని ఇళ్లలో దీపాలు వెలిగించారు. కుటుంబ సభ్యులంతా గ్రూపు ఫొటోలు దిగి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పలుచోట్ల పార్టీ నాయకులు లబ్ధిదారుల ఇళ్లలో వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదల జీవితాల్లో వెలుగులు వెదజల్లుతాయని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆగ్రో ఇండసీ్ట్రస్‌ మాజీ చైర్మన్‌ కాసుల బాల్‌రాజ్‌తో కలిసి బాన్సువాడ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకొన్నారు. నియోజకవర్గంలోని బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో, బీర్కూర్‌ మండలం వీరాపూర్‌, నస్రుల్లాబాద్‌ మండలం మిర్జాపూర్‌ తదితర గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి సంబరాలు చేపట్టారు. ఆయన వెంట మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ జంగం గంగాధర్‌, నాయకులు ఎజాస్‌, నార్ల రవీందర్‌, శ్యామల, రాజశేఖర్‌, దామరంచ శంకర్‌, శశికాంత్‌, అప్పారావు, కాంత్‌రెడ్డి, అసద్‌, విఠల్‌ తదితరులు ఉన్నారు. ఎల్లారెడ్డిలో సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు చిత్ర పటాలకు కాంగ్రెస్‌ నాయకులు, లబ్ధిదారులు క్షీరాభిషేకం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement