ఐదు నెలలుగా అందని వేతనాలు! | - | Sakshi
Sakshi News home page

ఐదు నెలలుగా అందని వేతనాలు!

Nov 10 2026 1:49 AM | Updated on Nov 10 2026 1:49 AM

ప్రతిపాదనలు పంపించాం

కుటుంబ పోషణ ఇబ్బంది ఉంది

ఎల్లారెడ్డి రూరల్‌: ప్రభుత్వ పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచుతూ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న స్కావెంజర్లకు వేతన కష్టాలు తప్పడం లేదు. నెలనెలా జీతాలు అందాల్సిన వారికి ఐదు నెలలుగా అందకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దసరా, దీపావళి వంటి పండుగలు గడిచినా వేతనాలు చేతికి అందకపోవడంతో పండుగలను సైతం నిరాడంబరంగా జరుపుకోవాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కామారెడ్డి జిల్లాలో మొత్తం 1,017 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వాటి పరిధిలో సుమారు 1,200 మంది స్కావెంజర్లు విధులు నిర్వహిస్తున్నారు. పాఠశాలల ఆవరణ, తరగతి గదులు, వాష్‌రూంలు, మరుగుదొడ్లను నిత్యం శుభ్రం చేస్తూ విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం ఒక్కో పాఠశాలకు నెలకు రూ.3 వేల నుంచి రూ.20 వేల వరకు నిధులు కేటాయిస్తోంది. అమ్మ ఆదర్శ క మిటీలు, ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల సంఖ్య ను బట్టి స్కావెంజర్లను నియమించుకుంటున్నారు.

జూన్‌ నుంచి ఎదురుచూపులే!

ఈ ఏడాది జూన్‌లో పాఠశాలలు ప్రారంభమైన నా టి నుంచి ఇప్పటి వరకు స్కావెంజర్లకు వేతనాలు అందలేదు. నెలల తరబడి జీతాలు రాకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నామని వారు చెబుతున్నారు. పండుగల సమయంలోనైనా వేతనాలు వస్తాయని ఆశించినా నిరాశే మిగిలిందని వాపోతున్నారు.నిత్యం పాఠశాలలను శుభ్రంచేస్తూ తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ,తమ వేతనాల విషయంలో నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

అప్పులు చేసి కుటుంబ పోషణ

ఐదు నెలలుగా వేతనాలు అందకపోవడంతో నిత్యావసరాలు కొనుగోలు చేయడం, పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు భరించడం కష్టంగా మారిందని స్కావెంజర్లు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్‌ వేతనాలను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు.

స్కావెంజర్ల వేతనాలకు సంబంధించిన నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు విడుదలైన వెంటనే వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం.

– మల్లికార్జున్‌, డీఈవో

నేను ఎల్లారెడ్డి జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో స్కావెంజర్‌గా పని చేస్తున్నాను. ఐదు నెలల నుంచి జీతం రాక పోవడంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉంది. – భాగ్య, స్కావెంజర్‌,

జెడ్పీ ఉన్నత పాఠశాల, ఎల్లారెడ్డి

జిల్లాలో 1,200 మంది

స్కావెంజర్ల ఎదురుచూపులు

దసరా, దీపావళి గడిచినా

ఖాతాల్లో జమకాని నగదు

కుటుంబ పోషణ భారంగా

మారిందంటూ ఆవేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement