భిక్కనూరు: మండలంలోని కాచాపూర్ గ్రామ ప్రత్యేక సొసైటీ ఏర్పాటు చేయడంపై స్థానిక కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు సోమవారం సంబరాలు నిర్వహించారు. స్థానిక సొసైటీ వద్ద సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షట్కర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. గ్రామ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
నిజాంసాగర్: మండలంలోని అచ్చంపేట గ్రామానికి చెందిన తపట్ల సైమన్ బహుజన సాహిత్య అకాడమి హైదరాబాద్ వారు నిర్వహించిన అవార్డుకు ఎంపికయ్యారు. అచ్చంపేట ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసించిన సైమన్ పాఠశాల తరగతి గదులకు రంగులు దిద్ది, కుంచెతో మంత్రముగ్ధులను చేశారు. పాఠశాల రూపురేఖలు మార్చేసిన పూ ర్వ విద్యార్థి సైమన్ గురించి ఇటీవల ‘సాక్షి దినపత్రిక’లో వార్త ప్రచురించడంపై బహుజన సా హిత్య అకాడమి వారు డాక్టర్ అంబేడ్కర్ నేష నల్ అవార్డు 2026కు ఎంపిక చేశారు. ఈ మేర కు అవార్డు సెలక్షన్ కమిటీ నేషనల్ చైర్మన్ బీఎ స్‌ఏ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ చేతు ల మీదుగా అవార్డు అహ్వాన ప్రతాన్ని సోమవా రం అందుకున్నారు. అవార్డుకు ఎంపిక కావ డం సంతోషంగా ఉందని సైమన్ అన్నారు.
నిజాంసాగర్: జుక్కల్ మండలం బస్వాపూర్, సావర్‌గావ్, మథుర తండాలోని పలువురు బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సోమవారం పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం అందించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రమేశ్ దేశాయ్, సతీశ్ పటేల్, సురేశ్‌గొండ తదితరులు ఉన్నారు.
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన పుర్ర స్వప్న అనారోగ్యంతో బాధపడుతు హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలిని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సోమవారం పరామర్వించారు. స్వప్నకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం కుటుంబ సభ్యులకు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థికసాయం అందించినట్లు బీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు.


