ఫిలింనగర్: కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపి న వివరాలు ఇలా.. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమె గ్రామానికి చెందిన మెట్టు బాలసాయిలు (42) వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవాడు. ఈ ఏడాది వర్షాలు సరిగా కురవకపోవడంతో ఉపాధి కోసం గత నెల 29న నగరానికి వచ్చి శివ కార్తీకేయ హోమ్‌కేర్ సర్వీసెస్‌లో కేర్ టేకర్‌గా చేరాడు. న్యాయవిహార్‌లోని ఓ న్యాయమూర్తి నివాసంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో ఈనెల 2న రోగిని వెంట తీసుకుని అపోలో ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యులు రోగిని కేర్‌టేకర్‌తోపాటు నాలుగు రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని సూచించారు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు బాల సైలూ కనిపించడం లేదని కుటుంబసభ్యులకు సమాచారం అందింది. పలుచోట్ల వెతికినా కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నిజామాబాద్ అర్బన్: దీపావళి పండుగ సందర్భంగా జిల్లావ్యాప్తంగా పోలీసులు వివిధ ప్రాంతాల్లోని పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు. మొత్తంగా 125 కేసులు నమోదు కాగా, 649మందిని అరెస్టు చేసినట్లు సీపీ సాయిచైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. వారి వద్ద నుంచి రూ.13 లక్షల 7వేల 390 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. డివిజన్ల వారిగా ఇలా.. నిజామాబాద్ డివిజన్‌లో 29 కేసులు నమోదు చేయగా 175 మంది పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. రూ.5 లక్షల 25వేల 370 స్వాధీనం చేసుకున్నారు. ఆర్మూర్ డివిజన్‌లో 26 కేసులు నమోదుకాగా 131 మంది పట్టుబడారు. రూ.2 లక్షల 20వేల 760 స్వాధీనం చేసుకున్నారు. బోధన్ డివిజన్‌లో 70 కేసులు నమోదుకాగా 343 మంది పట్టుబడ్డారు. రూ.5 లక్షల 61, 260 స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి ప్రత్యేక టీమ్‌లు పేకాట ఆడుతున్నవారిని పట్టుకున్నట్లు తెలిపారు.
ఎల్లారెడ్డిలో..


