స్టేషన్ల ఆధునికీకరణ పనులు.. | - | Sakshi
Sakshi News home page

స్టేషన్ల ఆధునికీకరణ పనులు..

Nov 10 2026 1:25 AM | Updated on Nov 10 2026 1:25 AM

స్టేషన్ల ఆధునికీకరణ పనులు.. తగ్గనున్న ప్రయాణ సమయం..

సికింద్రాబాద్‌ –నాందేడ్‌ – ముథ్కేడ్‌ రైల్వే మా ర్గంలో సింగిల్‌ ట్రాక్‌ మాత్రమే ఉంది. దీంతో ఎదు రుగా వేరే రైలు వస్తే సమీపంలోని స్టేషన్‌లో మరో రైలును నిలిపివేయాల్సి వస్తోంది. ఆ రైలు స్టేషన్‌ దాటేదాకా ప్రయాణికులు వేచి ఉండాల్సిన పరిస్థితి. దీంతో వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. క్రాసింగ్‌ల మూలంగా మాటిమాటికీ రైళ్ల నిలిపివేతతో రైలు ప్రయాణం అంటేనే విసుగు వస్తుంటుంది.

ఉమ్మడి జిల్లాలో..

సింగిల్‌ రైల్వే లైన్‌ వల్ల ఏర్పడుతున్న సమస్యకు చెక్‌ పెట్టేందుకు రైల్వే శాఖ డబ్లింగ్‌ పనులు చేపట్టింది. మేడ్చల్‌ నుంచి నాందేడ్‌ వరకు దాదాపు 221 కిలోమీటర్ల పరిధిలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో డబ్లింగ్‌ పనులు పూర్తయ్యాయి. నిజామాబాద్‌ నుంచి కామారెడ్డి మీదుగా మనోహరాబాద్‌, మేడ్చల్‌ వరకు పనులు కొనసాగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పర్యవేక్షణలో జరుగుతున్న ఈ డబ్లింగ్‌ పనులు నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల పరిధిలోని పలు సెక్షన్లలో ముమ్మరమయ్యాయి. డబుల్‌ లైన్‌ కోసం మట్టి పనులతో పాటు, వంతెనల నిర్మాణ పనులు నడుస్తున్నాయి. మేడ్చల్‌ –కామారెడ్డి –నిజామాబాద్‌ సెక్షన్‌లో మేడ్చల్‌ –మరోహరాబాద్‌ వరకు ఒక బిట్‌గా, మాసాయిపేట –అక్కన్నపేట, కామారెడ్డి –ఇందల్వాయి –డిచ్‌పల్లి వేర్వేరు బిట్ల రూపంలో పనులు చేపట్టారు. ఇప్పటికే చాలావరకు ఎర్త్‌వర్క్‌ పూర్తయ్యింది. కొన్నిచోట్ల పనులు కొనసాగుతున్నాయి. ఇంకొన్ని చోట్ల కంకర కూడా పరుస్తున్నారు. మరోవైపు వంతెనల పనులూ నడుస్తున్నాయి. 2027 చివరి నాటికి ఈ మార్గంలో డబ్లింగ్‌ పనులు పూర్తవుతాయని భావిస్తున్నారు.

అమృత్‌ స్కీం కింద కామారెడ్డి, నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌ల ఆధునికీకరణకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ భారీ ఎత్తున నిధులు మంజూరు చేసింది. కామారెడ్డి స్టేషన్‌ అభివృద్ధికి రూ.39.84 కోట్లు, నిజామాబాద్‌ స్టేషన్‌కు రూ.58 కోట్లు మంజూరరయ్యాయి. మొదట్లో పనులు మందకొడిగా సాగినా ఇటీవల వేగం పుంజుకున్నాయి. రెండు రైల్వే స్టేషన్‌ల రూపురేఖలు మారుస్తున్నారు. ఆధునిక డిజైన్లతో మెరుగులు అద్దుతున్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం చేపట్టిన లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జీల పనులు పూర్తి కావచ్చాయి. స్టేషన్‌లోకి వెళ్లే గేట్లను విస్తరించడానికి కోకాలను తొలగించనున్నారు. స్టేషన్‌కు ఆధునిక హంగులు తీసుకువచ్చేలా పనులు కొనసాగుతున్నాయి.

ఇప్పటికే సికింద్రాబాద్‌ నుంచి కామారెడ్డి, నిజామాబాద్‌ మీదుగా నాందేడ్‌ వరకు విద్యుదీకర ణ పనులు పూర్తయి విద్యుత్‌ ఇంజన్లతో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. డబ్లింగ్‌ పనులు పూర్తయితే క్రా సింగ్‌ కష్టాలు తీరనున్నాయి. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు ఆటంకాలు పూర్తిగా తొలగిపోయి ప్రయాణ సమయం తగ్గనుంది. కామారెడ్డి నుంచి హైదరాబాద్‌కు గంటన్నరలో చేరుకోవచ్చు. నిజామాబాద్‌కు సైతం ప్రయాణ సమయం తగ్గుతుంది. అలాగే డబ్లింగ్‌ అయిన తర్వాత మరిన్ని రైలు సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశాలుంటాయి. సికింద్రాబాద్‌ నుంచి నాందేడ్‌కు వందే భారత్‌ రైలు నడపేందుకు ఇప్పటికే రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించింది. డబ్లింగ్‌ పూర్తయితే ఈ మార్గంలో వందే భారత్‌ రైలు సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.

కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో

కొనసాగుతున్న పనులు

వచ్చే ఏడాది అందుబాటులోకి

వచ్చే అవకాశం

తీరనున్న క్రాసింగ్‌ కష్టాలు..

పెరగనున్న రైలు సర్వీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement