కామారెడ్డి టౌన్: చేయూత పింఛన్ల మంజూరుకు సంబంధించి వివిధ అధికారుల లాగిన్లలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నింటినీ గడువులోగా పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశీలనలో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. అనర్హులకు పింఛన్లు ఇవ్వొద్దని, అదే సమయంలో అర్హత కలిగిన ఏ ఒక్క లబ్ధిదారుడూ అవకాశం కోల్పోకూడదని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్వై గిరి, డీఆర్డీవో దామోదర్‌రెడ్డి, జెడ్పీ సీఈవో చందర్ తదితరులు పాల్గొన్నారు.


