వ్యాపారులు చెప్పిందే ధర..
కాంటాలు మొదలుపెట్టాలి
నిజాంసాగర్: జిల్లాలో వానాకాలం సీజన్‌కు సంబంధించిన పంట నూర్పిడీ 75 శాతం పూర్తికావస్తున్నా.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం తూకాల జాడ కరువైంది. దీంతో కొనుగోలు కేంద్రాల వద్ద వడ్ల రాశులు పేరుకుపోతున్నాయి. మరోవైపు వ్యాపారులు సిండికేటుగా మారి ధర తగ్గించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా..
జిల్లాలో సుమారు 6 లక్షల టన్నుల వరిధాన్యం సేకరణ లక్ష్యంగా 418 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. సొసైటీలు, ఐకేపీ ఆధ్వర్యంలో 15 రోజుల క్రితమే కొనుగోలు కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఇప్పటివరకు ఒకటిరెండు సెంటర్లు మినహా మిగతా చోట్ల తూకాలు మొదలు పెట్టలేదు. మరోవైపు రైతులు కోసింది కోసినట్లుగా పంటను కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. దీంతో కేంద్రాల వద్ద ఎటు చూసినా ధాన్యం రాశులే కనిపిస్తున్నాయి.
పంట చేతికివచ్చే తరుణంలో వ్యాపారు లు ప్రభుత్వ మద్దతు ధర, బోనస్‌కు మించి చె ల్లించి కొనుగోలు చేసిన వ్యాపారులు.. ఆ త ర్వాత సిండికేటుగా మారి ధర తగ్గించేశారు. ప్ర భుత్వం కొనుగోళ్లను ప్రారంభించకపోవడంతో వ్యాపారులు చెప్పిందే ధరగా నడుస్తోంది. సీజ న్ ప్రారంభంలో పచ్చి సన్న వడ్లకు క్వింటాలు కు రూ. 3,500 వరకు చెల్లించిన వ్యాపారులు.. ప్రస్తుతం ఆరబెట్టినా రూ. 3 వేలు కూడా చెల్లించడం లేదు. దీంతో రైతులు నష్టపోతున్నారు.
కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకువచ్చి 15 రోజులవుతోంది. ఇప్పటికీ కాంటాలు మొదలు కాలేదు. వడ్ల సీరియల్ రాసేటోళ్లు కూడా లేరు. కేంద్రాల్లో కాంటాలు ప్రారంభించాలి. – వెంకట్‌రాంరెడ్డి, రైతు, కోమలంచ
కొనుగోలు కేంద్రాల్లో
పేరుకుపోతున్న ధాన్యం
సిండికేటుగా మారి
ధర తగ్గించిన వ్యాపారులు
ఆందోళనలో అన్నదాతలు


