● ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ
భిక్కనూరు/దోమకొండ/కామారెడ్డి రూరల్: ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదల సొంతింటి కల నెరవేరుతోందని, వారి జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ పేర్కొన్నారు. ఆదివారం భిక్కనూరు, దోమకొండ మండల కేంద్రాలతోపాటు కామారెడ్డి మండలం తిమ్మక్‌పల్లి(జీ), గర్గుల్ గ్రామాల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు నిర్వహించారు. షబ్బీర్ అలీ, ప్రజాప్రతినిధులు, అధికారులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్ల వద్ద దీపాలు వెలిగించి, టపాకాయలు కాల్చారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ కార్యక్రమాలలో సర్పంచ్‌లు బల్యాల రేఖ, ఐరేని నర్సయ్య, చింతల దివ్య, మోతె యాదగిరి గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీరాజాగౌడ్, సొసైటీల చైర్మన్లు భూమయ్య, అనంతరెడ్డి, సుతారి రమేష్, శ్రీనివాస్‌రెడ్డి, పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్‌రావు, నాయకులు నరేందర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, లింబాద్రి, సందీప్, శ్రీనివాస్, తిర్మల్‌గౌడ్, సీతారం మధు, శ్రీనివాస్, దుర్గారెడ్డి, బాల్‌రాజు, మహమ్మద్ ఇలియాస్, రవితేజ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


