కామారెడ్డి టౌన్: టీజీ టెట్ రాసే ఇన్‌సర్వీస్ టీ చర్స్‌కు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) వి ధానంపై అవగాహన కోసం మాక్ టెస్ట్‌లు ని ర్వహించనున్నట్లు డీఈవో మల్లికార్జున్ తెలిపా రు. ఇందుకోసం పాల్వంచ జెడ్పీహెచ్‌ఎస్, స దాశివనగర్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, నిజాంసా గర్ మోడల్ స్కూళ్లలో కేంద్రాలు ఏర్పాటు చే శామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు ఈ కేంద్రాల్లోని కంప్యూటర్లతో పాటు https:// schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లోనూ మాక్ టెస్ట్ రాసుకోవచ్చని సూచించారు. గురువారం నుంచి 10వ తేదీ వరకు ఈ మాక్ టెస్ట్ లు అందుబాటులో ఉంటాయన్నారు. సీబీటీ పై సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఇదొ క మంచి అవకాశమన్నారు. ఈ పరీక్షకు ఎలాంటి ఓడీ సౌకర్యం ఉండదని, వ్యక్తిగత సౌల భ్యం మేరకే హాజరుకావాలని పేర్కొన్నారు.
భిక్కనూరు: పెద్దమల్లారెడ్డిలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా సహకార అధికారి రామ్మోహన్ బుధవారం సందర్శించారు. నిర్వాహకులకు సూచనలు ఇచ్చారు. సీరియల్ ప్రకారం తేమశాతం పరిశీలించి తూకాలు వేయాలన్నారు. ధాన్యంలో పొల్లు లేకుండా చూసుకోవాలన్నారు. ఆయన వెంట మానిటరింగ్ అధికారి నర్సింలు, సొసైటీ చైర్మన్ రాజాగౌడ్, కార్యదర్శి మోహన్‌గౌడ్, సంఘం డైరెక్టర్లు కిష్టయ్య, బాబు తదితరులున్నారు.
దోమకొండ: ఆయిల్‌పాం సాగు చేసి రైతులు అధిక దిగుబడులు పొందాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి జ్యోతి సూచించారు. బుధవా రం అంబారిపేటలో రైతు ప్రవీణ్ కుమార్ వ్య వసాయ క్షేత్రంలో రైతులకు ఆయిల్‌పాం సా గుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆ యిల్‌పాంతోపాటు అంతర పంటలు కూడా వేసుకోవచ్చన్నారు. ఆయిల్‌పాం సాగుకు ముందుకు వచ్చే రైతులకు డ్రిప్ సిస్టమ్ కోసం ఎకరాకు రూ. 5వేల ఆర్థిక సహాయాన్ని హిందుస్థాన్ యూనీలివర్ కంపెనీ అందిస్తోందని, ఈ అవకాశం డిసెంబర్ వరకే ఉంటుందని పే ర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కవిత అ నిల్, హార్టికల్చర్ ఆఫీసర్ సుమన్, హెచ్‌ఈవో బాపురెడ్డి, ఏఈవో మనూష, రైతులు శివకుమార్, అరుణ్ కుమార్, నర్సింలు, శేఖర్‌రావు, సత్తయ్య, రాజిరెడ్డి, యాదగిరిరావు, నర్సింలు, హెచ్యూఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు.
మాచారెడ్డి: ఆరేపల్లి 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో అదనంగా ఏర్పాటు చేసిన 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌తో ఓవర్ లోడ్ సమస్య తీరుతుందని విద్యుత్ శాఖ ఎస్‌ఈ సాలియా పేర్కొన్నారు. బుధవారం పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను అమర్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అదనపు పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుతో సబ్‌స్టేషన్ పరిధిలోని ఆరేపల్లి, భవానీపేట్ తండాలలో ఓవర్‌లోడ్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతి, డీఈలు నందకుమార్, కల్యాణ్ చక్రవర్తి, కామారెడ్డి రూరల్ ఏఈ నరే ష్, పాల్వంచ ఏఈ జ్యోతి, టీఆర్‌ఈ హన్మంతరెడ్డి, రైతులు పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: యాదగిరిగుట్టలో అక్టోబర్ 26, 27, 28 తేదీల్లో నిర్వహించిన ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఇంటర్ సర్కిల్ కల్చరల్ ప్రోగ్రాంలో ప్రతిభ చూపినవారిని మంగళవారం కామారెడ్డి ఎస్‌ఈ సాలియా నాయక్ అభినందించారు. జిల్లాకు చెందిన శివాని(ఉత్తమ వేషధారణ), బద్రి అనిల్‌కుమార్( ఏకపాత్రాభినయం), టీ.స్వామి(పాటలు) హేమలత, శివాని (చదరంగం) పోటీలలో బహుమతులు గెలుచుకున్నారు. వారిని ఎస్‌ఈతోపాటు డీఈలు సారథి, నందకుమార్, ఏవో రాజశేఖర్, ఉమ్మడి జిల్లా క్రీడల అధికారులు గోపి, ఉత్తమ్ అభినందించారు.


