● సర్కారు బడికి
చేయూతనందించిన కూతురు
● రూ. 22 లక్షలతో భవన నిర్మాణం
● నేడు ప్రారంభించేందుకు ఏర్పాట్లు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: కన్న తండ్రిపై ప్రేమను సమాజానికి మేలు చేసే ఆశయంగా మలచుకున్నారు ఆ కూతురు. నాన్న జ్ఞాపకాలను చిరస్థాయి గా నిలిపేందుకు పేద విద్యార్థుల చదువులకు కొండంత బాసటగా నిలుస్తున్నారు. వివరాలిలా ఉ న్నాయి. జిల్లా కేంద్రానికి చెందిన అక్షర దిగ్గజం దివంగత అమరేశం రాజేశ్వర శర్మ ఉమ్మడి రాష్ట్రంలో తెలు గు భాషాభివృద్ధికి, తెలుగు సాహిత్య రంగానికి ఎనలే ని కృషి చేశారు. ఆయన కూతురు శ్రీవారి భారతి కుటుంబం హైదరాబాద్లో నివసిస్తోంది. ఆమె భర్త డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ ప్రముఖ శాస్త్రవేత్త. ఆయన జాతీయ సంస్థల్లో కీలక విభాగాల్లో పనిచేశారు. భారతి ఇంటి వద్దే ఉంటూ ఎస్సీఎస్ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కొన్నాళ్ల క్రితం దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్యూరిఫైడ్ నీటిని అందించే ప్లాంటును ఏర్పాటు చేయించారు. అనేక ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని కాకతీయనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అక్కడి బస్తీలకు చెందిన పేద పిల్లలు ఎక్కువ మంది చదువుతుంటారు. గదుల కొరత ఉన్న విషయం తెలుసుకున్న శ్రీవారి భారతి పాఠశాలను సందర్శించి, గదుల సమస్య తీరుస్తానని భరోసా ఇచ్చారు. మూడు తరగతులకు ఉపయోగపడేలా రూ. 22 లక్షలతో భవనం నిర్మించారు. భవనంలో ఫ్యాన్లు, లైట్లు కూడా బిగించారు.


