పంట రుణాల ఉపశమన చర్యలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

పంట రుణాల ఉపశమన చర్యలు చేపట్టాలి

Nov 5 2026 2:04 AM | Updated on Nov 5 2026 2:04 AM

పంట రుణాల ఉపశమన చర్యలు చేపట్టాలి

కామారెడ్డి టౌన్‌: కరువు ప్రభావిత మండలాల రైతులకు బ్యాంకుల ద్వారా రుణ ఉపశమన చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ బ్యాంకు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం.03 ప్రకారం కల్పించాల్సిన బ్యాంకింగ్‌ వెసులుబాట్లపై బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని జుక్కల్‌, పెద్దకొడప్‌గల్‌, సదాశివనగర్‌, మహమ్మద్‌నగర్‌ మండలాలను ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించిన నేపథ్యంలో అన్నదాతలకు ఆర్థిక భరోసా కల్పించాలన్నారు. నిబంధనల ప్రకారం అర్హులైన రైతులకు పంట రుణాలు, దీర్ఘకాలిక వ్యవసాయ రుణాల పునర్వ్యవస్థీకరణ, మారటోరియం సదుపాయాలను వేగంగా వర్తింపజేయాలని ఆదేశించారు. పాడి, కోళ్లు, గొర్రెలు, మేకల పెంపకం వంటి అనుబంధ రంగాలకు బ్యాంకులు ఉదారంగా రుణాలు అందించాలన్నారు. సమావేశంలో ఎల్‌డీఎం, నాబార్డ్‌ డీడీఎం, ఆర్‌బీఐ ప్రతినిధి, వివిధ బ్యాంకుల సమన్వయకర్తలు, జిల్లా వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల అధికారులు, డీఆర్‌డీఏ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement