● ఏడో రోజుకు చేరిన ఎన్‌హెచ్‌ఎం
ఉద్యోగుల నిరవధిక సమ్మె
కామారెడ్డి టౌన్: సమస్యలను పరిష్కరించాలని డి మాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాల యం ఎదుట జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్‌హెచ్‌ఎం) కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారంతో ఏడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగులు ఒంటికాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. మహిషాసురమర్దిని వేషధారణలో ప్లకార్డులతో ప్రదర్శన ఇచ్చారు. సమ్మె శిబిరాన్ని కామారెడ్డి జేఏసీ నాయకులు జగన్నాథం, వేణుగోపాల్ తదితరులు సందర్శించి సంపూర్ణ మద్దతు తెలిపారు. 20 ఏళ్లుగా ప్రజారోగ్య పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఉద్యోగులకు ‘సమాన పనికి సమాన వేతనం’ అందించకపోవడం అన్యాయమన్నారు. సమ్మె అనంతరం ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు టీపీసీసీ రాష్ట ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి సుమన్, నాయకులు, వైద్యులు, హరీశ్, అశ్విని, రాజశేఖర్, స్వాతి, మనోజ్, రాహుల్, సందీప్, క్రాంతి, నరేందర్, అఖిల్, నిర్మల, హరిత, స్వరూప తదితరులు పాల్గొన్నారు.


