దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

Oct 20 2026 1:44 AM | Updated on Oct 20 2026 1:44 AM

దరఖాస్తుల ఆహ్వానం హిందువులు ఐక్యంగా ఉండాలి పోషకాహార కిట్ల పంపిణీ

కామారెడ్డి టౌన్‌ : జాతీయ ఆయుష్‌ మిషన్‌లో భాగంగా జిల్లాలో అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో ఎనిమిది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నోడల్‌ అధికారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ ఆయుష్‌ డాక్టర్‌ (1), మెడికల్‌ ఆఫీసర్‌ (2), డైటీషియన్‌ (1), సైకోసోషియల్‌ కౌన్సిలర్‌ (1), యోగా ప్రొఫెషనల్‌ (1), మల్టీ పర్పస్‌ వర్కర్‌ (2) పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. 18 నుంచి 44 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు అర్హులన్నారు. ధ్రువపత్రాల గెజిటెడ్‌ కాపీలతో దరఖాస్తులను ఈ నెల 24 నుంచి 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కలెక్టరేట్‌లోని రూం నంబర్‌ 25లో స్వయంగా లేదా రిజిస్టర్డ్‌ పోస్టు ద్వారా అందజేయాలని సూచించారు.

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): హిందువులు ఐక్యంగా ఉండాలని ఆర్‌ఎస్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా విభాగ్‌ ప్రతినిధి నర్ర వెంకట శివకుమార్‌ సూచించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా దసరా కార్యక్రమం నిర్వహించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధులు కొప్పుల నర్సారెడ్డి, జైపాల్‌ రెడ్డి, సామల రవి, బిట్ల శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి టౌన్‌: జిల్లా కేంద్రంలోని బాంబే క్లాత్‌ హౌస్‌, వర్డ్‌ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సోమవారం 30 మంది నిరుపేదలకు పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాంబే క్లాత్‌ హౌస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీటీ లాల్‌ మాట్లాడుతూ.. మానవ సేవయే మాధవ సేవగా భావించి నిరుపేదల ఆరోగ్యాన్ని కాపాడేందుకు తమవంతు సహాయం చేస్తున్నట్లు తెలిపారు. ఉమెన్స్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌(వర్డ్‌) సంస్థ క్షేత్రస్థాయిలో అర్హులైన నిరుపేదలను గుర్తించగా, బాంబే క్లాత్‌ హౌస్‌ యాజమాన్యం ఆర్థిక సహకారం అందించింది. కార్యక్రమంలో వర్డ్‌ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఎస్‌.రాణి, వంశీకృష్ణ, యాదగిరి, శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement