ప్లాస్టిక్‌ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలి

Oct 20 2026 1:44 AM | Updated on Oct 20 2026 1:44 AM

● నీటి సంరక్షణపై జీపీ తీర్మానం

అభినందనీయం

● అదనపు కలెక్టర్‌ ఎన్‌వై గిరి

లింగంపేట(ఎల్లారెడ్డి): ప్లాస్టిక్‌ రహిత గ్రామంతోపాటు నీటి సంరక్షణ చేసే గ్రామంగా లింగంపల్లి(ఖుర్దు)ని తీర్చిదిద్దడానికి పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేయడం అభినందనీయమని అదనపు కలెక్టర్‌ ఎన్‌వై గిరి అన్నారు. గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎల్‌నినో నేపథ్యంలో గ్రామంలో నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఇంటింటికీ ఇంకుడు గుంతలు, సామూహిక ఇంకుడు గుంతలు, పంట కుంటలు, బోర్‌వెల్‌ రీచార్జి ఫిట్స్‌ తదితర వాటిపై చర్చించారు. రైతులు ఆరుతడి పంటలు సాగుచేయాలని సూచించారు. ప్రజలు ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించి, నీటిని పొదుపుగా వినియోగిస్తూ లింగంపల్లి(ఖుర్దు)ని పరిశుభ్రమైన, ప్లాస్టిక్‌ రహిత గ్రామంగా అభివృద్ధి చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గొల్ల ప్రత్యూష, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు గొల్ల సాయిరాంయాదవ్‌, డీఆర్డీవో దామోదర్‌రెడ్డి, హౌసింగ్‌ పీడీ విజయ్‌పాల్‌రెడ్డి, డీఏవో మోహన్‌రెడ్డి, డీఎల్‌పీవో శ్రీనివాస్‌, తహసీల్దార్‌ సురేష్‌, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, ఎంపీవో మలహరి, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement