కామారెడ్డి టౌన్: జిల్లా వ్యాప్తంగా ఆదివారం సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. తీరొ క్క పూలతో ఊరూవాడ పూలవనంగా మారింది. తొమ్మిది రోజులపాటు సాగిన పూల పండుగ ముగింపు వేడుకలను మహిళలు అ త్యంత వైభవంగా జరుపుకున్నారు. గునుగు, తంగేడు, బంతి, చామంతి తదితర రంగురంగుల పూలతో పేర్చి న బతుకమ్మలు వీధు ల్లో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్, ధర్మశాల, పాత సాయిబాబా ఆలయ ప్రాంగణం, అశోక్‌నగ ర్, హౌసింగ్ బోర్డు కాలనీ, దేవి విహార్ తదితర ప్రాంతాల్లో మ హిళలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. బతుకమ్మలను మధ్యలో ఉంచి, చప్పట్లు కొడుతూ ల యబద్ధంగా పాటలు పాడు తూ ఉత్సాహంగా ఆడారు. అ నంతరం గౌరమ్మకు నైవేద్యా లు సమర్పించి, వాయినా లు ఇచ్చిపుచ్చుకున్నారు. స్థానిక నీటి తొట్లు, కా మారెడ్డి పెద్ద చెరువు, టేక్రియాల్ చెరువులో బతుకమ్మలను గంగ మ్మ ఒడికి చేర్చి, సద్దుల ను ఆరగించారు.
కామారెడ్డి
జిల్లా కేంద్రంలో
బతుకమ్మతో యువతి
ఎల్లారెడ్డి మండలం గండిమాసాని పేటలో బతుకమ్మతో యువతి
ఊరూరా బతుకమ్మల జోరు
అంబరాన్నంటిన ‘సద్దుల’ సంబురం
వాడవాడలా ఘనంగా బతుకమ్మ
వేడుకలు
భక్తిశ్రద్ధలతో గంగమ్మ ఒడికి గౌరమ్మలు


