వే‘గంగా’ దిగువకు.. | - | Sakshi
Sakshi News home page

వే‘గంగా’ దిగువకు..

Oct 19 2026 2:01 AM | Updated on Oct 19 2026 2:01 AM

వే‘గంగా’ దిగువకు..

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: జిల్లాలో భూగర్భ జల మ ట్టాలు స్వల్ప వ్యవధిలోనే భారీగా తగ్గాయి. భూగర్భజల శాఖ లెక్కల ప్రకారం.. సెప్టెంబర్‌ నెలాఖరులో జిల్లాలో సగటు భూగర్భ జలమట్టం 8.59 మీటర్లుగా ఉంది. అక్టోబర్‌ 17 నాటికి ఇది ఏకంగా 11.37 మీట ర్ల లోతుకు పడిపోయింది. కేవలం రెండు వారాల వ్యవధిలోనే నీటిమట్టం దాదాపు 2.78 మీటర్ల లోతుకు పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదు కాకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. జిల్లాలో సాధారణ వర్షపాతం 863.8 మి.మీ కాగా, 837.0 మి.మీ వర్షం కురిసింది. మద్నూర్‌ మండలంలో 30 శాతం లోటు వర్షపాతం, పెద్దకొడప్గల్‌ మండలంలో 27 శాతం లోటు వర్షపాతం నమోదైంది. అలాగే బిచ్కుంద, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, బీబీపేట, డోంగ్లి తదితర మండలాల్లో కూడా వర్షపాతం సాధారణం కన్నా తక్కువగా నమోదైంది.

ప్రశ్నార్థకంగా యాసంగి సాగు

భారీ వర్షాలు లేక వానకాలం పంటలకే దిగుబడి తగ్గుతుందేమోనన్న ఆందోళనలో ఉన్న అన్నదాతలకు, భూగర్భ జలాలు పడిపోవడం మరింత శరాఘాతంగా మారింది. నీటి మట్టాలు వేగంగా పడిపోతుండటంతో రాబోయే యాసంగి (రబీ) సీజన్‌లో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. బోర్లు వట్టిపోతే పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భూగర్భ జలాల సంరక్షణకు నీటి పొదుపు చర్యలు చేపట్టడంతోపాటు రాబోయే యాసంగిలో తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

జిల్లాలో భూగర్భ జల మట్టం వేగంగా పడిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు వర్షాలు మొహం చాటేయడం, మరోవైపు వానకాలం (ఖరీఫ్‌) పంటలకు చివరి తడుల కోసం రైతులు నిరంతరం బోరుబావులను వినియోగిస్తుండటంతో భూగర్భ జలాలు పాతాళానికి చేరుకుంటున్నాయి. దీంతో యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారింది.

పడిపోతున్న భూగర్భ జల మట్టం!

ఎత్తిపోతున్న బోరుబావులు

వానకాలం పంటలను

కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం

యాసంగి సాగుపై నీలినీడలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement