పర్యాటక ‘సాగర్‌’ | - | Sakshi
Sakshi News home page

పర్యాటక ‘సాగర్‌’

Oct 19 2026 2:01 AM | Updated on Oct 19 2026 2:01 AM

పర్యాటక ‘సాగర్‌’

నవంబర్‌లో ప్రారంభిస్తాం

● పూర్తయిన కాటేజీల నిర్మాణం

● వచ్చే నెలాఖరులోగా పూర్తి

నిజాంసాగర్‌(జుక్కల్‌): మంజీరా నది పరీవాహక ప్రాంతంపై ఉన్న నిజాంసాగర్‌ ప్రాజెక్టు పూర్వవైభవం సంతరించుకోనున్నది. జలసవ్వడితో పర్యాటకుల మదిని దోచేస్తున్న సాగర్‌ అందంగా ముస్తాబవుతోంది.

టూరిజం హబ్‌గా..

నిజాం కాలంలో నవాబ్‌ అలీ నవాజంగ్‌ బహదూర్‌ ప ర్యవేక్షణలో నిజాంసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీ కారం చుట్టారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ప్రజానీ కం కరువు కాటకాలతో తల్లడిల్లగా తాగు, సాగు నీటి అవసరాల కోసం 1923–31 సంవత్సరంలో ప్రాజె క్టును నిర్మించారు. జీరో డిస్ట్రిబ్యూటరీ నుంచి చివరి డి స్ట్రిబ్యూటరీ 75 బాల్కొండ వరకు సాగు నీటి ప్రవాహానికి ప్రధాన కాలువను ఏర్పాటు చేశారు. 2.75 లక్ష ఎ కరాల ఆయకట్టు ఉంది. ఉమ్మడి నిజామాబాద్‌, బో ధన్‌, బాన్సువాడ వరప్రదాయనిగా, పట్టణ ప్రజలకు తాగునీటి వనరుగా ఉంది. ‘ఎన్‌’ ఆకారంలో నిజాంసాగర్‌ ప్రాజెక్టును నిర్మించగా ప్రధాన ఇంజినీర్‌తో పాటు ఇంజినీర్లు, కూలీలు సేద తీరేందుకు గోల్‌బంగ్లా, ఛత్రిబంగ్లా, రెస్ట్‌హౌస్‌, గెస్ట్‌హౌస్‌, స్విమ్మింగ్‌ పూ ల్‌, వాటర్‌ ఫాల్స్‌, సమ్మర్‌బాగ్‌ను ఏర్పాటు చేశారు.

చెక్కు చెదరని కట్టడాలు

నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు దిగువన పర్యాటకుల కోసం అప్పట్లోనే 500 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ప్రాజెక్టు తీర ప్రాంతంలో నిర్మించిన భవనాలు నేటికీ చెక్కుచెదరలేదు. స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు నిజాంసాగర్‌ ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధి చేయాలని అసెంబ్లీ సమావేశాలతోపాటు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వం రూ. 10 కోట్లు మంజూరు చేసింది.

12 ఎకరాల్లో టూరిజం పనులు

గోల్‌ బంగ్లా వద్ద ఎకో టూరిజం పనుల కోసం 12 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. రూ. 7.7 కోట్ల నిధులతో గుల్‌ దస్తా వద్ద టూరిజం పనులు జోరుగా చేపడుతున్నారు. 17 కాటేజీలు, 7 సూట్‌లు, 2 రెస్టారెంట్లు, డార్మెటరీ గది, యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. స్విమ్మింగ్‌ పూల్‌, గార్డెన్‌ వంటి పనులు చేపడుతున్నారు. ప్రాజెక్టు 16 గేట్ల వద్ద పర్యాటల కోసం బోటింగ్‌ ఏర్పాటు చేశారు.

ఎకో టూరిజం పనులను నవంబర్‌ నెలాఖరులోగా పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తెస్తాం. కాటేజీల నిర్మాణం పూర్తయి రంగులు వేస్తున్నాం. డార్మెటరీ, హోటల్‌, బంకెట్‌ హాల్‌, హార్ష్‌ నిర్మిస్తున్నాం. – సోయల్‌, ఏఈఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement