మళ్లీ వరి సాగు వైపే..! | - | Sakshi
Sakshi News home page

మళ్లీ వరి సాగు వైపే..!

Oct 19 2026 2:01 AM | Updated on Oct 19 2026 2:01 AM

మళ్లీ వరి సాగు వైపే..!

● నార్లు పోస్తున్న రైతులు

బాన్సువాడ రూరల్‌: ఒకవైపు ప్రభుత్వం వరి పంట సాగుకు విరామం ఇవ్వాలని చెబుతున్నా మరోవైపు రైతులు వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. బాన్సువాడ మండలం పోచారం, రాంపూర్‌ తండా రైతులు స్వల్పకాలిక వరి వంగడాలను నారు వేస్తున్నారు. వర్షాకాలంలో ఆలస్యంగా వరి సాగు చేసిన పంటల కోసం విడుదల చేస్తున్న నిజాంసాగర్‌ నీటితో తాము నాట్లు వేసుకుంటామని, ఆ తర్వాత బోరుబావుల ద్వారా పంటకు నీరందిస్తామని చెబుతున్నారు. అయితే యాసంగిలో బోరుబావుల వద్ద ఉన్న మొత్తం భూమిలో కాకుండా 50 శాతం మాత్రమే వరి సాగు చేస్తామని పేర్కొంటున్నారు. ఈసారి వడ్ల ధర ప్రభుత్వ మద్దతు ధరకు మించి క్వింటాలుకు రూ.700 నుంచి రూ.1000 అదనంగా రావడమే యాసంగిలో రైతులు వరి సాగుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement