ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల మౌనదీక్ష | - | Sakshi
Sakshi News home page

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల మౌనదీక్ష

Oct 19 2026 2:01 AM | Updated on Oct 19 2026 2:01 AM

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల మౌనదీక్ష ‘దేవగిరి’ ఆలస్యం బతుకమ్మ సంబురాల్లో అపశృతి ప్రభుత్వ పాఠశాలలకు నాబార్డు నిధులు మంజూరు పంటలకు ఊపిరి.. ప్రజలకు ఉపశమనం

కామారెడ్డి టౌన్‌: వైద్య ఆరోగ్యశాఖలోని జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారంతో ఆరో రోజుకు చేరింది. ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో ఉద్యోగులు నోటికి నల్ల రిబ్బన్లు ధరించి మౌనదీక్షతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి సుమన్‌, ప్రధాన కార్యదర్శి బట్టు పద్మజ మాట్లాడుతూ.. తమ న్యాయమైన డిమాండ్లను ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ఇక తేల్చాల్సింది ప్రభుత్వమేనని అన్నారు. సద్దుల బతుకమ్మ పండుగను సైతం పక్కనపెట్టి మహిళా ఉద్యోగులు దీక్షా శిబిరానికి తరలివచ్చారు. కార్యక్రమంలో జేఏసీ ఉపాధ్యక్షుడు వెంకటరమణ, నాయకులు, వైద్యులు మీనాక్షి, సుధాకర్‌, రవళి, రాహుల్‌, రాజశేఖర్‌, అఖిల్‌, రంజిత్‌ తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి అర్బన్‌: ముంబై–లింగంపల్లి (దేవగిరి ఎక్స్‌ప్రెస్‌–17057) రైలు దాదాపు 10 గంటల ఆలస్యంతో ప్రయాణికులు ఇ బ్బందులు ఎదుర్కొన్నారు. ముంబై ఛత్ర పతి శివాజీ టర్మినల్‌ నుంచి రైలు శనివారం రాత్రి 9.30 గంటలకు బయల్దేరి కామారెడ్డి రైల్వేస్టేషన్‌కు ఆదివారం మధ్యాహ్నం 12.25 గంటలకు చేరుకోవాల్సి ఉంది. అయి తే రైలును అంబర్‌నాథ్‌, బద్లాపూర్‌, లోనావాలా, పూణే మీదుగా మళ్లీంచారని కామారెడ్డికి చెందిన సంతోష్‌ అనే ప్రయాణికుడు ఫోన్‌లో తెలిపారు. రైలు ఆలస్యంతో బతుక మ్మ పండగకు సకాలంలో ఇళ్లకు చేరుకోలేకపోయినట్లు ఆవేదన వ్యక్తంచేశాడు. పనుల నేపథ్యంలో రైలు ఆలస్యంగా నడిచినట్లు అధికారులు తెలిపారు.

● చెరువులో పడి ఒకరి మృతి

భిక్కనూరు: సద్దుల బతుకమ్మ సంబురాల్లో అపశృతి చోటు చేసుకుంది. భిక్కనూరు మండలం తిప్పాపూర్‌ గ్రామంలో ఆదివారం బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. అనంతరం పలుగు చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేసేందుకు గ్రామానికి చెందిన ధర్మగళ్ల స్వామి(45) వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగాడు. గమనించిన గ్రామస్తులు చెరువులోకి దూకి స్వామిని ఒడ్డుకు తీసుకువచ్చారు. అయితే అప్పటికే స్వామి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసు లు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహా న్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. బతుకమ్మ పండుగ పూట ఘటన జరగడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భా ర్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో సుమారు 100కు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నాబార్డు నిధులు విడుదలయ్యాయి. నిధులతో నూతన తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి వసతి తదితర పనులు చేపట్టనున్నారు. పాఠశాలలకు నాబార్డు నిధులు మంజూరయ్యేలా కృషిచేసిన ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌రావుకు కాంగ్రెస్‌ నాయకులతోపాటు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

● బాన్సువాడలో గంటపాటు

కురిసిన వర్షం

బాన్సువాడ రూరల్‌ : బాన్సువాడ మండలంలో ఆదివారం మధ్యాహ్నం కురిసిన వర్షం పంటలకు ప్రాణం పోసింది. ఉక్కపోతతో ఉ క్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఉపశమనా న్ని ఇచ్చింది. పంటలకు చివరితడి అవసరం కాగా, సుమారు గంటపాటు కురిసిన వర్షంతో రైతులు హర్షం వ్యక్తంచేశారు. పలుచోట్ల నూర్పిళ్లు పూర్తి చేసిన ధాన్యం తడిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement