వంతెన వద్ద పిండ ప్రదానం | - | Sakshi
Sakshi News home page

వంతెన వద్ద పిండ ప్రదానం

Sep 5 2026 5:43 AM | Updated on Sep 5 2026 5:43 AM

లింగంపేట : గతేడాది కురిసిన భారీ వర్షాలకు మండలంలోని లింగంపల్లి పాముల వాగు వంతెన కొట్టుకుపోయింది. దీంతో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ వంతెన వద్ద శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌మోహన్‌ రావుకు పిండ ప్రదానం చేశారు. కూలిన వాగును పరిశీలించేందుకు గతేడాది సెప్టెంబర్‌4న లింగంపల్లికి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి నూతన నిర్మాణం చేపట్టాలని అధికారులు, ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావును ఆదేశించారు. కానీ నేటికీ ఎలాంటి పనులు చేపట్టలేదు. దీనికి నిరసనగా వంతెన వద్ద పిండ ప్రదానం చేసినట్లు మాజీ ఎమ్మెల్యే తెలిపారు. అధికారంలో ఉన్న ఎమ్మెల్యే నిధులు తేవడంలో పూర్తిగా విఫలమైయ్యారని, నిధులు తేలేని ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రారంభించిన పనులు తాను చేశానని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఇకనైనా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement