ప్రవేశాల్లో ఆదర్శం.. | - | Sakshi
Sakshi News home page

ప్రవేశాల్లో ఆదర్శం..

Sep 5 2026 1:56 AM | Updated on Sep 5 2026 1:56 AM

ప్రవేశాల్లో ఆదర్శం..

మాచారెడ్డి: వృత్తినే పరమావధిగా భావించి అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయుల్లో లచ్చాపేట జెడ్పీహెచ్‌ఎస్‌ జీహెచ్‌ఎం లక్కిరెడ్డి రాజేశ్వర్‌ రెడ్డి ఒకరు. 2023లో పదోన్నతిపై లచ్చాపేటకు రాగా ఆ సమయంలో స్కూల్‌లో విద్యార్థుల సంఖ్య 96 మాత్రమే. బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్రమక్రమంగా విద్యార్థుల సంఖ్యను పెంచారు. 2024లో 110, 2025లో 122, 2026లో 154కు పెంచి అధికారుల మన్ననలు పొందారు. పూర్వ విద్యార్థుల సహకారంతో వేదిక నిర్మాణం, పాఠశాలకు అవసరమైన ఫర్నిచర్‌, విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు ఇస్తూ చదువుపై శ్రద్ధ కలిగించారు. పదో తరగతి విద్యార్థులకు సెప్టెంబర్‌ నుంచే రాత్రి 9 గంటల వరకు స్టడీ అవర్స్‌ నిర్వహించి వందశాతం ఉత్తీర్ణత సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement