సమాజాన్ని సన్మార్గంలో నడిపించే గురుతర బాధ్యతను నిర్వర్తించే పవిత్రమైనది ఉపాధ్యాయ వృత్తి. వ్యక్తి వికాసంలో గురువు స్థానం విశిష్టమైనది. తల్లిదండ్రుల తర్వాత స్థానం వారిదే. అందుకే గురు దేవోభవ.. ఆచార్య దేవోభవ.. అంటూ దైవంతో పోలుస్తారు. మనల్ని విజ్ఞాన వంతులుగా తీర్చిదిద్దడానికి వారు చేసిన, చేస్తున్న కృషి వెలకట్టలేనిది. అందుకే మన జీవితంలో వారికి ఉన్నత స్థానమిస్తాం. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బోధనలో వినూత్నంగా, కృత్యాలలో వైవిధ్యంగా, బడినే గుడిగా మలుస్తూ విద్యార్థుల భవితను తీర్చిదిద్దుతున్న కొందరు ఉపాధ్యాయులపై ప్రత్యేక కథనం... – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
వినూత్న బోధనతో కొందరు
ఆట, పాటలతో అర్థమయ్యే రీతిలో..
మౌలిక సదుపాయాలు కల్పిస్తూ..
విద్యార్థుల భవిష్యత్తును
తీర్చిదిద్దుతున్న టీచర్లు
నేడు ఉపాధ్యాయ దినోత్సవం


