బీబీపేట: మహిళలు, వికలాంగులు, వృద్ధుల పెన్షన్ పెంచకుండా మోసం చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి వారి గోస తగులుతుందని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని గార్డెన్‌లో మహిళలు, వికలాంగులు, వృద్ధులకు ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వంపై నియోజకవర్గ స్థాయి వంటావార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డినుంచి పోటీ చేసి ఓడిపోయిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీబీపేట వంతెన వద్ద రోడ్డు తెగిపోయి ఏడాదయినా అటు షబ్బీర్ అలీ, ఇటు కాటిపల్లి వెంకటరమణారెడ్డి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ ప్రేమ్‌కుమార్, మాజీ ఎంపీపీ బాలమణి, సర్పంచులు నాగరాజు, రాజాగౌడ్, పవిత్ర శ్రీనివాస్, నాయకులు భూమేష్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.


