న్యూస్‌రీల్
శనివారం శ్రీ 29 శ్రీ ఆగస్టు శ్రీ 2026
– 8లో u
పిల్లల సమగ్ర వికాసానికి చదువుతోపాటు ఆటపాటలూ అవసరం. మార్కులు, ర్యాంకులకు ప్రాధా న్యమిస్తున్న ఈ కాలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లలు తరగతి గదుల్లోనే గడపాల్సి వ స్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో అంతో ఇంతో నయం. ప్రయివేటు బడుల్లో అయితే ఆటాపాటలకు చోటే లే దు. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడోపాధ్యాయులు ఉన్న చోట విద్యార్థులకు నిత్యం ఏదో ఒక ఆట ఆడిస్తూ ప్రో త్సహిస్తున్నారు. చాలా స్కూళ్లలో ఆడించే ఉపాధ్యా యులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడతున్నారు.
40 శాతం స్కూళ్లలో..
జిల్లాలో మొత్తం 183 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా 110 మంది పీఈటీలు, పీడీలు ఉన్నారు. మిగతా 73 స్కూళ్లలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు క్రీడా ఉపాధ్యాయుల పోస్టులు లేవు. కొన్నిచోట్ల క్రీడలపై ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు పిల్లలను ఆటల్లో తీర్చిదిద్దుతున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు క్రీడలపై ఎంతో ఆసక్తి ఉంది. చాలాచోట్ల విద్యార్థులు తమకు ఇష్టమైన ఆయా ఆటల్లో ప్రతిభ కనబరుస్తున్నారు. కబడ్డీ, హాకీ, వాలీబాల్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్.. ఇలా ఎన్నో రకాల క్రీడల్లో జిల్లా విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. గడిచిన రెండు, మూడేళ్లుగా పాఠశాల పిల్లలను ఆటల్లో తీర్చిదిద్దేందుకు అవసరమైన సామగ్రి కొనుగోలుకు నిధులు వస్తున్నాయి. పీఈటీలు, పీడీలు ఉన్న స్కూళ్లలో వాటిని సద్వినియోగం చేసుకొని విద్యార్థులను వివిధ క్రీడల్లో రాణించేలా వారికి శిక్షణ ఇస్తున్నారు. జిల్లా నుంచి వందలాది మంది విద్యార్థులు వివిధ ఆటల్లో రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదిగారు. అయితే క్రీడా ఉపాధ్యాయులు లేని బడుల్లో విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. అన్ని పాఠశాలల్లోనూ వ్యాయామ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు.
మండల, జిల్లా స్థాయిలో ప్రతి ఏడాది క్రీడా పోటీలు నిర్వహిస్తే విద్యార్థుల్లో ఆటలపై మరింత ఆసక్తి పెరుగుతుంది. క్రీడాపోటీల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థులు ప్రతిభను చాటుకొని ఆయా ఆటల్లో రాణించగలుగుతారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, తర్వాత రాష్ట్రస్థాయికి వెళ్లగలుగుతారు. జాతీయ స్థాయికీ ఎంపికవుతారు. మండల, జిల్లా స్థాయిలో క్రీడల నిర్వహణకు ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయాన్ని క్రీడాకారులు వ్యక్తం చేస్తున్నారు.
సర్కారు బడుల్లో
క్రీడా ఉపాధ్యాయుల కొరత
జిల్లాలో 73 పోస్టులు ఖాళీ
క్రీడలపై ఆసక్తి చూపుతున్న పిల్లలు
ప్రోత్సహిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగే అవకాశం
నేడు జాతీయ క్రీడా దినోత్సవం
ప్రభుత్వ పాఠశాలల్లో ఏళ్లుగా వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి నోచుకోకపోవడంతో విద్యార్థుల్లోని ప్రతిభ వెలికిరావడం లేదు. ఇక చాలావరకు ప్రయివేటు బడుల్లో ఆటల ఊసే లేదు. ఆటలు లేక శారీరక, మానసిక ఎదుగుదల లోపిస్తోంది. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
జిల్లాలోని ప్రయివేటు పాఠశాలల్లో ఆటలకు ప్రాధాన్యమివ్వడం లేదు. పొద్దస్తమానం పుస్తకాలతోనే కుస్తీ పట్టిస్తున్నారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల సమయంలో ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు తప్ప పెద్దగా పిల్లలను ఆడించే ప్రయత్నం చేయడం లేదు. కొన్ని స్కూళ్లలో యోగా క్లాసులు, అప్పుడప్పుడు ఆటలు ఆడిస్తున్నారు. చాలా స్కూళ్లలో ఆడుకునేందుకు స్థలాలు కూడా లేవు. అనుమతులు పొందే సమయంలో కాగితాలపై గ్రౌండ్ ఉన్నట్టు చూపుతున్నారే తప్ప చాలా స్కూళ్లలో ఆట స్థలాలు లేక విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు.


