● అర్హుల ఓట్లు జాబితాలో
ఉండేలా చూడండి
● అదనపు కలెక్టర్ గిరి
మాచారెడ్డి: ఎస్‌ఐఆర్ హియరింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఎన్‌వై గిరి సూచించారు. శుక్రవారం ఆయన లచ్చాపేట గ్రామా న్ని సందర్శించి, సర్ ప్రక్రియను పరిశీలించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాలన్నారు. నిబంధనల ప్రకారం పరిశీలన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.
నాణ్యతతో కుట్టాలి..
ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా యూనిఫాంలను నాణ్యతతో కుట్టాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఆయన లచ్చాపేటలో యూనిఫాంల స్టిచ్చింగ్‌ను పరిశీలించారు. గడువులోగా స్టిచ్చింగ్ పనులను పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సరళ, సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


