సదాశివనగర్/భిక్కనూరు: కుష్టువ్యాధి రహిత సమాజం కోసం కృషి చేయాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందని కుష్టు వ్యాధి రహిత రాష్ట్ర బృందం ప్రతినిధి రాజు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆశ కార్యకర్తల సమావేశానికి హాజరై కుష్టువ్యాధిపై అవగాహన కల్పించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నమోదు అవుతున్న కుష్టు వ్యాధి రోగులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అలాగే భిక్కనూరు ప్రభుత్వాస్పత్రిలో వైద్య సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వైద్యాధికారి వెంకటి, రాష్ట్ర కుష్టు నివారణ బృందం సభ్యులు వెంకటేశ్వరచారీ, శ్రీనివాస్, సురేందర్, ప్రదీప్‌కుమార్, డీపీఎంవో జీవన్, భిక్కనూరు, సదాశివనగర్ పీహెచ్‌సీ వైద్యులు యెమిమా, ఆస్మా అప్షిన్, వైద్యసిబ్బంది, ఆశవర్కర్లు పాల్గొన్నారు.


