కామారెడ్డి టౌన్ : ఆపదలో ఉన్న పేద కుటుంబానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ అండగా నిలిచారు.జిల్లా కేంద్రానికి చెందిన నూర్ జహాన్ షే క్ గుండె సంబంధిత వ్యాధితో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.మిగితా రూ.1.31 లక్షల బిల్లు చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని యాజమాన్యం కుటుంబీకులకు స్పష్టం చేసింది.ఈ విషయమై బాధిత కు టుంబ సభ్యులు షబ్బీర్ అలీని గురువారం అర్ధరా త్రి ఆశ్రయించారు. స్పందించిన ఆయన వెంటనే ఆస్పత్రి సీఈవో శశికాంత్‌తో ఫోన్‌లో మాట్లాడి, మానవతా దృక్పథంతో మిగిలిన బిల్లును మాఫీ చే యాలని విజ్ఞప్తి చేశారు.అలాగే మృతురాలి కుటుంబానికి తన వ్యక్తిగత నిధుల నుంచి రూ. 50వేల ఆ ర్థిక సాయం అందించారు. తన సిబ్బందిని ఆస్ప త్రికి పంపి జాప్యం లేకుండా మృతదేహాన్ని అప్పగించేలా చర్యలు తీసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులు షబ్బీర్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు.


