జీజీహెచ్‌లో బరువు తక్కువతో శిశువు జననం | - | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌లో బరువు తక్కువతో శిశువు జననం

Jul 25 2026 12:47 AM | Updated on Jul 25 2026 12:47 AM

అత్యవసరంగా నిజామాబాద్‌కు తరలింపు

కామారెడ్డి టౌన్‌ : అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన హన్మండ్ల సంతోషి శుక్రవారం జిల్లా కేంద్రంలోని జీజీహెచ్‌ ఆస్పత్రిలో శస్త్రచికిత్స ద్వారా మూడో కాన్పులో ఆడ శిశువుకు జన్మనిచ్చారు. శిశువు బరువు చాలా తక్కువగా ఉండటంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడింది. దీంతో మెరుగైన చికిత్స కోసం రాత్రి ప్రత్యేక నియోనాటల్‌ 108 అంబులెన్స్‌లో నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. మార్గమధ్యలో 108 ఈఎంటీ కృష్ణస్వామి, పైలట్‌ మహేశ్‌ సమయస్ఫూర్తితో పాపకు అత్యవసర వైద్య సేవలు అందిస్తూ నిజామాబాద్‌ తరలించారు. 108 సిబ్బందికి శిశువు తండ్రి నవీన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement