దోమకొండ: రెడ్డి ఐక్యవేదిక దోమకొండ మండల నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నాగర్తి చంద్రారెడ్డి అధ్యక్షతన మండలకేంద్రంలో మండలరెడ్డి సంఘాల సమావేశం నిర్వహించారు. రెడ్డి ఐక్యవేదిక మండల అధ్యక్షుడిగా పన్యాల రామ్మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా ధర్పల్లి సంజీవరెడ్డి, పుర్ర బాపురెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నాయిని సంతోష్‌రెడ్డి, సహాయ కార్యదర్శిగా నాయిని రాజిరెడ్డి, కోశాధికారిగా పందిరి సంజీవరెడ్డి, కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు జూకంటి మోహన్ రెడ్డి, సభ్యులు కొప్పుల గంగారెడ్డి, ప్రతాపరెడ్డి, రావులపల్లి నర్సారెడ్డి, అండెం శంకర్ రెడ్డి, సిద్ధారెడ్డి, పన్యాల నాగరాజు రెడ్డి, మన్నే సాయిరెడి,్డ తదితరులు పాల్గొన్నారు.


