నిరంతరం అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

నిరంతరం అప్రమత్తంగా ఉండాలి

Jul 23 2026 1:18 AM | Updated on Jul 23 2026 1:18 AM

నిరంతరం అప్రమత్తంగా ఉండాలి

ఉచిత న్యాయసేవలను

సద్వినియోగం చేసుకోవాలి

సీనియర్‌ సివిల్‌ జడ్జి నాగరాణి

భిక్కనూరు: సామాజిక సమస్యలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి నాగరాణి సూచించారు. బుధవారం భిక్కనూరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, విధ్యార్థుల భద్రత, చట్టపరమైన హక్కులు, వారిపై జరుగుతున్న మోసాలు, వేధింపుల నివారణ అంశాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు లేదా చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1098, అత్యవసర సేవల నంబర్‌ 112కు సమాచారం అందించాలన్నారు. జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ప్రజలకు ఉచిత న్యాయసేవలు అందిస్తుందని, అవసరమైన వారు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో రాజగంగారెడ్డి, ఇన్‌చార్జి హెచ్‌ఎం శ్రీమతి, జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీసభ్యులు సంతోష్‌రెడ్డి, శ్రవణ్‌, నరేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement