● తెయూ రిజిస్ట్రార్ యాదగిరి
● ఘనంగా సౌత్ క్యాంపస్ వార్షికోత్సవం
భిక్కనూరు: విద్యార్థులు నాయకత్వ లక్షణాలను, క్రీడల్లో నైపుణ్యాన్ని పెంచుకోవాలని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరి సూచించారు. బుధవారం భిక్కనూరు మండలంలోని తెయూ సౌత్‌క్యాంపస్‌లో తరంగ్ –2026 వార్షికోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎదురయ్యే ఓటములకు కుంగిపోకుండా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగితే విజయాలు వరిస్తాయన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలన్నారు. కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నారు. సౌత్‌క్యాంపస్‌లోని వివిధ విభాగాలు సాధించిన ప్రగతిని గురించి ప్రిన్సిపాల్ సుధాకర్‌గౌడ్ వివరించారు. క్రీడలతో పాటు సాంస్కృతిక రంగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులను అందించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి, ఏపీఆర్‌వో సరిత, అధ్యాపకులు ప్రతిజ్ఞ, యాలాద్రి, సునీత, అంజయ్య, లలిత, హరిత, నాగరాజు, నారాయణ, కవితతోరన్, వైశాలి, శ్రీమాత, నిరంజన్, ఇంద్రకరణ్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.


