గుప్పుమంటున్న గుడుంబా | - | Sakshi
Sakshi News home page

గుప్పుమంటున్న గుడుంబా

Mar 16 2026 7:31 AM | Updated on Mar 16 2026 7:31 AM

తగిన చర్యలు తీసుకుంటున్నాం

గ్రామాల్లో పెరుగుతున్న స్థావరాలు

అధికారుల పర్యవేక్షణ కరువు

ప్రజల పాలిట శాపంగా

మారుతున్న పరిస్థితి

సిరికొండ: పల్లెల్లో గుడుంబా గుప్పుమంటోంది. మారుమూల గ్రామాలు, గిరిజన తండాల్లో గుట్టుచప్పుడు కాకుండా సారా తయారు చేస్తున్నారు. అబ్కారీ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పల్లెల్లో నాటు సారా ఏరులై పారుతోంది. సిరికొండ మండలంలో గిరిజన తండాలు అధికంగా ఉండటంతో తండాలు, మారుమూల గ్రామాల్లో గుడుంబా తయారీ జోరుగా కొనసాగుతోంది. పల్లెల్లో నాటు సారా అమ్మకాలను కొందరు తమ ప్రవృత్తిగా కొనసాగిస్తున్నారు. పూరి గుడిసెల్లో బట్టీలను పెట్టి దొంగచాటుగా నాటు సారాను కాస్తుంటారు. సారాను ప్లాస్టిక్‌ ప్యాకెట్లలో నింపి గ్రామాలకు తరలిస్తు పొలిమేరల్లో విక్రయాలు సాగిస్తున్నారు.

హానికర పదార్థాలతో..

పల్లెల్లో నాటు సారాను విక్రయదారులు ప్రాణాంతక పదార్థాలతో తయారు చేస్తున్నారు. యూరి యా, పటిక, నల్లబెల్లం, తంబాకు లాంటి హానికర పదార్థాలను గుడుంబా తయారీలో వినియోగిస్తున్నారు. ఇలా ప్రాణాంతక పదార్థాలతో తయారు చేసిన సారాను తాగి పేద ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు.

మద్యం అధిక ధరలతో..

మద్యం ధరలు అధికంగా ఉండడంతో పేదలు గుడుంబా వైపు మొగ్గుచూపుతున్నారు. ఒక్కోసారా ప్యాకెట్టు తక్కువ ధరకే లభిస్తుండటంతో ధరలు అధికంగా ఉన్న మద్యాన్ని కొనలేక కూలీ పనులు చేసుకునే వారు సారాకు బానిసలవుతున్నారు. తక్కువ ధరకు దొరుకుతుందని హానికర పదార్థాలతో తయారు చేస్తున్న విషయం గమనించక నాటు సారాను తాగుతు పేద ప్రజలు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

నాటు సారా తయారు చేయకుండా, విక్రయించకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. సారా తయారీ, వాడకం వల్ల కలిగే అనర్థాలపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. సారా తయారీదారులపై కేసులు నమోదు చేసి తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేస్తున్నాం.

– వేణుమాధవరావు, భీంగల్‌ ఎకై ్సజ్‌ సీఐ

చర్యలు శూన్యం

నాటు సారా విక్రయాలపై అబ్కారీ అధికారుల చర్యలు శూన్యంగా మారాయి. నామ మాత్రంగా దాడులు చేయడమే తప్ప నాటు సారా తయారీని ని వారించడానికి పకడ్బందీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో నాటు సారా అమ్మకాలు పూర్తిగా కనుమరుగు కాగా, గత రెండేళ్లుగా పల్లెల్లో మళ్లీ గుడుంబా గుప్పుమంటోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నాటు సారా తయారు చేస్తున్న, విక్రయిస్తున్న వారిని ఎకై ్సజ్‌ శాఖ అధికారులు పట్టుకొని తహసీల్‌ ఎదుట బైండోవర్‌ చేస్తున్నారు. ఇటీవల చీమన్‌పల్లి, తాటిపల్లి గ్రామాలకు చెందిన ముగ్గురిని తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement