మద్నూర్(జుక్కల్): కాలాలు కూడా కొంతమందికి కడుపు నింపుతాయి. ఏడాదంతా చిన్నాచితకా పను లు చేసుకుంటున్న వారికి వేసవిలో చేతినిండా పను లు దొరుకుతాయి. వేసవి వచ్చిందంటే చాలు విద్యు త్ ఉపకరణాలు వాడని వారుండరు. పేద మధ్య త రగతుల ప్రజలు కుడా ఫ్యాన్లు, కూలర్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ సీజన్‌లో విద్యుత్ ఉపకరణాల మరమ్మతులు పెరగడంతో రిపేర్లకు ఉపాధి దొరుకు తోంది.అలాగే అసెంబుల్డ్ కూలర్లు తయారు చేస్తుండటంతో మధ్య తరగతి ప్రజలు కూడా వేసవిలో చ ల్లబడటం కోసం కూలర్లు తీసుకుంటున్నారు. ఫ్యా న్లు, కూలర్లే కాదు.. ఏసీలు, ఫ్రిజ్‌ల బిగింపు లాంటి పనులతో వారికి చేతినిండా పనులు దొరుకుతున్నా యి. ఎండలు ముదురుతున్నాయి. ఉక్కపోత ఎక్కువైంది. వేడి నుంచి ఉపశమనం కోసం స్థాయిని బట్టి ఫ్యాన్లు, మధ్య తరగతి వారు కూలర్లు, ఉన్నతవర్గాల వారు ఏసీలు వినియోగిస్తున్నారు. మెకానిక్‌లు కూడా బిజీ అయిపోయారు. గ్రామాల నుంచి కూడా ఫ్యాన్లు, కూలర్లు మరమ్మతుల కోసం మండల కేంద్రానికి వస్తున్నారు.


