అనిరుధ్‌ కుటుంబసభ్యులకు పరామర్శ | - | Sakshi
Sakshi News home page

అనిరుధ్‌ కుటుంబసభ్యులకు పరామర్శ

Mar 16 2026 7:31 AM | Updated on Mar 16 2026 7:31 AM

అనిరుధ్‌ కుటుంబసభ్యులకు పరామర్శ హన్‌మాన్‌ దేవాలయంలో పూజలు కిటకిటలాడిన సిద్ధరామేశ్వరాలయం ఎడ్లబండ్ల ప్రదర్శన భక్తులకు అన్నదానం

కామారెడ్డి టౌన్‌ : ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన చెందిన జిల్లా కేంద్రంలోని అశోక్‌ నగర్‌ కాలనీకి చెందిన మంగలి దేవేందర్‌ కుమారుడు అనిరుధ్‌(13) కుటుంబాన్ని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌ రెడ్డి ఆదివారం పరామర్శించారు. బాలుడి నివాసానికి వెళ్లిన ఆయన, అనిరుధ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చిన్న వయసులోనే కుమారుడు మృతి చెందడం ఆ కుటుంబానికి తీరని లోటని చంద్రశేఖర్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నాయకులు పంపరి లక్ష్మణ్‌, జమీల్‌, జూలూరి సుధాకర్‌, పిడుగు సాయిబాబా, రాజశేఖర్‌, సునీల్‌ గౌడ్‌, నర్సుల మహేష్‌ తదితరులున్నారు.

భిక్కనూరు: మండల కేంద్రంలోని కొత్తపేట హన్‌మాన్‌ దేవాలయంలో పాల్గుణ బహుళ ద్వాదశి సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చే తెలుగు కొత్త సంవత్సరం సందర్భంగా ఆలయంలో పంచాంగ శ్రవణం నిర్వహించడంతో పాటు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. వార్డు సభ్యుడు సిద్ధారెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

భిక్కనూరు:ఽ భిక్కనూరు సిద్దరామేశ్వరాలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వేకువజామునుంచే భక్తులు ఆలయానికి వచ్చి మూలబావి వద్ద స్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయం భక్తులతో సందడిగా ఉంది.

లింగంపేట(ఎల్లారెడ్డి): అయ్యపల్లి శివారులోని ప్రభుస్వామి ఆలయం చుట్టూ ఆదివారం ఎడ్లబండ్ల ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడ్లబండ్ల ప్రదర్శనను టెంకాయ కొట్టి ప్రారంభించారు. ఆలయం చుట్టూ ఐదు సార్లు ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. మూడు రోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నట్లు తెలిపారు.

లింగంపేట(ఎల్లారెడ్డి): అయ్యపల్లి శివారులోని ప్రభుస్వామి ఆలయం వద్ద ఆదివారం అన్నదా న కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్శి వెంకటేశం లింగమణి దంపతులు జా తరకు వచ్చే భక్తులు, ప్రజలకు అన్నదానం చే శారు. ప్రతి ఏటా జాతర సమయంలో అన్నదా నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. పార్శి ప్రభాకర్‌, లక్ష్మీపతి, శ్రీనివాస్‌, పవన్‌, మల్లయ్య, గంగాధర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement