ఆటో చోరీ కేసులో నిందితుడి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

ఆటో చోరీ కేసులో నిందితుడి అరెస్టు

Mar 16 2026 7:31 AM | Updated on Mar 16 2026 7:31 AM

నాలుగు ఆవుల చోరీ

నిజామాబాద్‌అర్బన్‌: జల్సాలకు అలవాటుపడి ఆటో చోరీ చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు నార్త్‌రూరల్‌ సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. ఈనెల 13న న్యాల్‌కల్‌ రోడ్డులో నివాసం ఉండే పండ్ల వ్యాపారి నర్సింలు తన ఆటో చోరీకి గురైనట్లు 5వ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నగరంలోని నెహ్రూనగర్‌కు చెందిన షేక్‌నయీమ్‌ జల్సాలకు అలవాటుపడి మద్యం కోసం డబ్బులు లేకపోవడంతో చిల్లర దొంగతనాలకు అలవాటు పడ్డాడు. అందులో భాగంగానే నర్సింలు ఆటోను దొంగిలించినట్లు సీఐ తెలిపారు. ఆటోను మహారాష్ట్రలో విక్రయించేందుకు తీసుకెళ్తుండగా అర్సపల్లిలో పట్టుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. కేసును ఐదో టౌన్‌ ఎస్సై గంగా ధర్‌, సిబ్బంది త్వరగా ఛేదించినట్లు సీఐ తెలిపారు.

ఎల్లారెడ్డిరూరల్‌: ఎల్లారెడ్డి పట్టణంలోని సూర్య విహార్‌ కాలనీలో నాలుగు ఆవులు చోరీకి గురైనట్లు బాధితులు ఆదివారం తెలిపారు. పట్టణంలోని సూర్యవిహార్‌లో పశువుల పాకలో కట్టి ఉంచిన నాలుగు ఆవులను దుండగులు చోరీకి పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement