● జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
నిజాంసాగర్(జుక్కల్): పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల కోసం నిర్విరామంగా పాటు పడుతుందన్నారు. ప్రభుత్వ పథకాలు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజాపాలనకు ప్రజలు ఆకర్షితులై గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నిక ల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారన్నారు. ఆదివారం మహమ్మద్‌నగర్ మండల కేంద్రంలోని సొసైటీ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి జుక్కల్ ఎమ్మెల్యే ముఖ్య అఽతిథిగా హాజరయ్యారు. మండల కేంద్రానికి చెందిన బుడగజంగాలు, పాండవులు, సింగితం గ్రామానికి చెందిన పలువురు వార్డు స భ్యులు, బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎ మ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మె ల్యే తోట లక్ష్మీకాంతారావు వారినుద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని వస్తున్న నాయకు లు, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవాలన్నారు. పిట్లం ఏఎంసీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమా ర్, మహమ్మద్‌నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, సర్పంచులు రమేష్‌యాదవ్, హరిన్,కుమ్మరిరాములు, కిరణ్, రఫీ కాంగ్రెస్ నా యకులు నర్సింలు, నాగబూషణంగౌడ్, లోక్యానాయక్, గుర్రపు శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.
అర్హులందరికి ఇందిరమ్మ ఇళ్లు
ఒడ్డేపల్లిలో ఇందిరమ్మ ఇల్లును ఆదివారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ప్రారంభించారు. ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చిన ప్రతీ ఒక్కరికి ఇండ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సర్పంచ్ బొజ్జ అంజయ్య, నాయకులు ప్రజాపండరి తదితరులున్నారు.


