చికిత్స పొందుతూ ఒకరి మృతి
రెంజల్(బోధన్):రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. రెంజల్ మండలం తాడ్‌బిలోలి గ్రా మానికి చెందిన రాజేందర్(45) మూడు రోజుల క్రితం సాటాపూర్ నుంచి జాతీయ రహదారి మీదుగా స్వగ్రామానికి బైక్‌పై వెళ్తుండగా బోర్గాం శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. తీవ్రగాయాలతో ఘటన స్థలంలో పడి ఉన్న క్షతగాతుడిని స్థానికులు నిజామాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
గొర్రెల మందపై కుక్కల దాడి
ధర్పల్లి: మండల కేంద్రానికి చెందిన కుర్మ నడిపి సాయిలుకు చెందిన గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో ఆరు గొర్రెలు మృతి చెందాయి. మరో ఆరు గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. నడిపి సాయిలు తన గొర్రెలను పగలు మేత కోసం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి రాత్రి ఇంటి పరిసరాల్లో రక్షణ చర్యలు చేపట్టి ఉంచుతారు. ఆదివారం తెల్లవారుజామున గొర్రెల మంద పై వీధి కుక్కలు దాడి చేశాయి. మండల పశు వైద్యాధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. గాయపడిన గొర్రెలకు ప్రథమ చికిత్స అందజేశారు. సుమారు రూ.80 వేల వరకు నష్టం వాటిళ్లిందని బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితుడు కోరాడు.


