శ్రీరామ నవమికి ఏర్పాట్లు పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

శ్రీరామ నవమికి ఏర్పాట్లు పూర్తి చేయాలి

Mar 16 2026 7:31 AM | Updated on Mar 16 2026 7:31 AM

మున్సిపల్‌ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌, నుడా చైర్మన్‌ కేశవేణు

రఘునాథ ఆలయం సందర్శన

నిజామాబాద్‌ రూరల్‌: శ్రీరామ నవమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌, నుడా చైర్మన్‌ కేశవేణు అన్నారు. జిల్లా కేంద్రంలోని రఘునాథ ఆలయ అభివృద్ధి ప నుల కోసం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఇటీవల రూ.50 లక్షల నిధులు మంజూరైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ కమిషనర్‌, నూడా చైర్మన్‌ ఆదివారం ఆలయ పరి సర ప్రాంతాలను సందర్శించి రోడ్లు అంచనా వే యించినారు. శ్రీరామనవమి సందర్భంగా భక్తుల కు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తామని,తగిన వస తులు మున్సిపల్‌ ద్వారా కల్పిస్తామని వారు అన్నా రు. ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు ముక్క దేవేందర్‌ గుప్తా, కోశాధికారి పెండ్యాల శ్రీనివాస్‌, కమిటీ ట్రస్ట్‌ మెంబర్‌, కార్యవర్గ సభ్యులు భక్తవత్సలం నా యుడు, డీ రాజేంద్రప్రసాద్‌, బంటు బలరాం తదితరులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు అశోక్‌ కుమార్‌, సంపత్‌, బింగి ప్రకాశ్‌, చల్ల గంగాధర్‌, తాటి వీరేశం, నరేందర్‌ గౌడ్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement