కామారెడ్డి క్రైం: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 6 న ప్రారంభించనున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో జిల్లానుంచి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాల్గొన్నారు. 99 రోజుల పాటు చేపట్టాల్సిన కార్యక్రమాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయడం, సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించడంతోపాటు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం, డ్రగ్స్ నియంత్రణ, భూసార పరీక్షలు, యూరియా యాప్ వినియోగం తదితర అంశాలపై సీఎం పలు సూచనలు ఇచ్చారన్నారు.


