లింగంపేట(ఎల్లారెడ్డి): అటవీ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని మహాత్మా జ్యోతీబాఫూలే గురుకుల పాఠశాలలో మంగళవారం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు మాట్లాడారు. విద్యార్థులకు వన్యప్రాణుల సంరక్షణ, అటవీ పరిరక్షణ ప్రాముఖ్యతను వివరించారు. వన్యప్రాణులకు ముప్పురాకుండా తీసుకుంటున్న జాగ్రత్తలను వివరించారు. వన్యప్రాణులను సంరక్షించడం అందరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌ఎస్‌వో భాస్కర్, ఎఫ్‌బీవోలు శేఖర్, నిఖిల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


