తాడ్వాయి: మక్కల కొనుగోళ్లను వేగవంతం చేయా లని మార్క్‌ఫెడ్ డీఎం శశిధర్‌రెడ్డి సూచించారు. ఆయన మంగళవారం తాడ్వాయిలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. హమాలీలను పెంచి మరొక కాంటాను ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. రైతులు తెచ్చిన మక్కలను జల్లెడ పట్టి మట్టిని తొలగించిన తర్వాతే తూకం వేయాలన్నారు. లేకపోతే గోదాంల నుంచి తిరిగి వస్తాయని హెచ్చరించారు. ఇప్పటివరకు వారంరోజుల్లో 7 వేలకుపైగా సంచుల మక్కలను కొనుగోలు చేశామన్నారు. మక్కలు విక్రయించిన రైతుల ఖాతాలలో డబ్బులు త్వరలోనే పడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి నర్సయ్య, సిబ్బంది బాలకిషన్, నితీష్‌రెడ్డి, శ్రీకాంత్, రమేష్, రైతులు రాజేశ్వర్‌రెడ్డి, రాంరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మహేంందర్‌రెడ్డి, బాలురెడ్డి, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


