ఒకరిపై కేసు నమోదు
భిక్కనూరు: పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఒకరిపై కేసు నమోదు చేసినట్లు భిక్కనూరు ఎస్సై అంజనేయులు తెలిపారు. వివరాలు ఇలా.. మండల కేంద్రం సమీపంలోని గుర్జకుంట గ్రామానికి వెళ్లె బీటీరోడ్డు పక్కన రెడ్డి సంఘం స్థలంలో ఎలాంటి అనుమతి లేకుండా టాటా హిటాచీ పొక్లెయినర్‌తో పనులు చేపట్టారు. దీనిపై సంఘం అధ్యక్షుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వాహన యజమాని జ్ఞానప్రకాశ్‌రెడ్డి, డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం వాహనాన్ని పోలీస్ సిబ్బంది పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తుండగా జ్ఞానప్రకాశ్‌రెడ్డి సిబ్బందిని అడ్డుకొని, న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందున ఆయనపై కేసు నమోదు చేసి, వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించామన్నారు. ఇదిలా ఉండగా పొక్లెయిన్‌ను రోడ్డుపై తీసుకెళ్తే రోడ్డు దెబ్బతింటుందని అన్నందుకే తనపై కేసు నమోదు చేశారని జ్ఞానప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు.
ఎల్లారెడ్డి: మండలంలోని సబ్దల్‌పూర్ శివారులో ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడినట్లు స్థానికులు మంగళవారం తెలిపారు. హైదరాబాద్ నుంచి మహ్మద్ నగర్ మండలంలోని సింగీతం గ్రామానికి ఆటోలో దంపతులు బయలుదేరారు. సబ్దల్‌పూర్ శివారులో ఆటో స్టీరింగ్ లాక్ కావడంతో ప్రమాదవశాత్తు పొలంలోకి వెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని అన్నారు.


