ఇన్‌చార్జి డీఎంహెచ్‌వోకు పదోన్నతి
కామారెడ్డి టౌన్: రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలు రాష్ట్రవ్యాప్తంగా డిప్యూటీ సివిల్ సర్జన్‌లుగా విధులు నిర్వహిస్తున్నవారికి సివిల్ సర్జన్(సీఎస్)లుగా పదోన్నతులు కల్పించింది. ఇందులో భాగంగా జిల్లా ఇన్‌చార్జి డీఎంహెచ్‌వోగా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ పదోన్నతి పొందారు. ఆయన ఆర్‌ఎంవోగా వికారాబాద్ వైద్య కళాశాల, జీజీహెచ్‌కు వెళ్తున్నారు. ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో బాధ్యతలను సీనియర్ వైద్యురాలు శిరీషకు అప్పగించే అవకాశాలు ఉన్నాయి.
జీజీహెచ్ ఆర్‌ఎంవోగా రవీందర్‌గౌడ్..
జీహెచ్‌ఎంసీ ప్రభుత్వ ఆస్పత్రిలో డిప్యూటి సివిల్ సర్జన్‌గా విధులు నిర్వహిస్తున్న రవీందర్‌గౌడ్ సీఎస్‌గా పదోన్నతి పొందారు. ఆయన ఆర్‌ఎంవోగా కామారెడ్డి వైద్య కళాశాల, జీజీహెచ్‌కు వస్తున్నారు.
కామారెడ్డి అర్బన్: యువ కళాకారులు తమ ప్రతిభను చాటి రాష్ట్రస్థాయిలో జిల్లా పేరును నిలబెట్టాలని అడిషనల్ కలెక్టర్ మధుమోహన్ సూచించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో జిల్లా స్థాయి యువజన ఉత్సవ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రాష్ట్రస్థాయిలో చక్కటి ప్రదర్శనలు ఇవ్వాలని సూచించారు. విజేతలకు జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేశ్వరగౌడ్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో శిక్షణ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే..
జానపద నృత్యంలో మర్కల్ డిగ్రీ కళాశాల ప్రథమ, కామారెడ్డి వీఆర్‌కే డిగ్రీ కళాశాల ద్వితీయ స్థానంలో నిలిచాయి. జానపద గీతాల్లో వీఆర్‌కే కళాశాల ప్రథమ, మర్కల్ కళాశాల ద్వితీయ బహుమతులు పొందా యి. కథా రచనలో సుప్రియ ప్రథమ, స్ఫూర్తి ద్వితీయ, పెయింటింగ్‌లో అంకిత ప్రథమ, జయశ్రీ ద్వితీయ, వక్తృత్వ పోటీల్లో ముర్సలిన్ ప్రథమ, వైష్టవి ద్వితీయ, కవిత్వంలో సీహెచ్ హర్షిణి ప్రథమ, కే.చైతన్య ద్వితీయ బహుమతి పొందారు. సైన్స్ మేళాలో కొండాపూర్ జెడ్పీ హైస్కూల్ ప్రథమ, భిక్కనూరు హైస్కూల్ ద్వితీయ, పాల్వంచ హైస్కూల్ తృతీయ బహుమతి పొందాయి.
లింగంపేట: ఇంటర్‌లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం సూచించారు. మంగళవారం ఆయన లింగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల, జ్యోతిబా పూలే, మైనారిటీ, కేజీబీవీలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలని అధ్యాపకులకు సూచించారు. విద్యార్థులకు ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా అటెండెన్స్ తీసుకోవాలన్నారు. ఈ నెల 14వ తేదీలోపు విద్యార్థులు పరీక్షల ఫీజులు చెల్లించాలన్నారు. ప్రిన్సిపాల్ నరేందర్, అధ్యాపకులు దుర్గయ్య, శివ, నర్సింగ్, స్వామిగౌడ్, రాజయ్య, అంజయ్య, ఆనంద్‌రెడ్డి, అభినవ్, నాగయ్య పాల్గొన్నారు.
తాడ్వాయి: ఉపాధి హామీ పథకం కూలీలు తప్పనిసరిగా ఈ–కేవైసీ చేయించుకోవాలని ఏపీవో కృష్ణ గౌడ్ సూచించారు. తాడ్వాయిలో మంగళవారం ఈ–కేవైసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ– కేవైసీ చేస్తేనే కూలీలకు ఉపాధి హామీ పనులకు వెళ్లడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. 18 గ్రామాలకు 11 మంది ఫీల్డు అసిస్టెంట్లు ఉన్నారని, మిగతా 7 గ్రామాలలో సీనియర్ మేట్ల ద్వారా ఈ–కేవైసీ చేయిస్తున్నామని పేర్కొన్నారు. రెండు రోజుల్లో ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని సూచించారు.
ఇన్‌చార్జి డీఎంహెచ్‌వోకు పదోన్నతి
ఇన్‌చార్జి డీఎంహెచ్‌వోకు పదోన్నతి
ఇన్‌చార్జి డీఎంహెచ్‌వోకు పదోన్నతి


