పత్తి ఏరేందుకు కూలీల కొరత
కూలీలతో ఇబ్బందిగా ఉంది
● దడ పుట్టిస్తున్న కూలి రేట్లు
● ఆందోళనలో రైతులు
మద్నూర్: ఓవైపు వర్షాలతో పంటకు నష్టం జరగ్గా.. మరోవైపు కూలీల కొరతతో మరింత ఇబ్బందిపడుతు న్నారు పత్తిరైతులు. పంట సాగు చేయడం ఒక ఎత్తయితే.. పత్తిని తీయడం మరో ఎత్తుగా మారిందని పే ర్కొంటున్నారు. జిల్లాలో 17,713 ఎకరాలలో పత్తి సా గయ్యింది. వర్షాధారంగా ఈ పంట సాగు చేశారు. మొదటి దఫాలో చేతికి వచ్చిన పత్తిని తెంపేందుకు రైతులు కూలీల కోసం వెతుకుతున్నారు. అయితే కూ లీల కొరతతో డిమాండ్ పెరిగింది. గతంలో కిలో పత్తి తీస్తే ఐదారు రూపాయలు చెల్లించేవారు. ఇప్పుడు కూ లీలు రూ. 10 నుంచి రూ. 12 వరకు డిమాండ్ చేస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. పత్తి తీయడానికే క్వింటాలుకు వెయ్యి రూపాయల వరకు వెచ్చించాల్సి వస్తోందంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో పత్తి తడిసిపోయి కొంత నష్టం వాటిల్లింది. ఇదే సమయంలో కూలి రేట్లు పెరిగిపోవడంతో ఇబ్బంది పడుతున్నామని, పెట్టుబడులు కూడా వచ్చే అవకాశాలు లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలో కూలీల కొరత ఉంది. పత్తి తీసేందుకు పక్క గ్రామాల నుంచి కూలీలను తెస్తున్నాం. కూలీల కొరతతో వారు అడిగినంత ఇవ్వాల్సి వస్తోంది. కిలో పత్తి తీస్తే రూ. 12 కూలి చెల్లిస్తున్నా. పెట్టుబడి ఖర్చులేమో పెరగ్గా.. వర్షాలు, తెగుళ్లతో పంట దిగుబడులు తగ్గాయి. దీంతో పత్తి పండించినా ఏం లాభం వచ్చేలా లేదు.
– గంగాధర్, రైతు, అవాల్‌గావ్
పత్తి ఏరేందుకు కూలీల కొరత


