రైతులకు ఇబ్బందులు కలగనీయొద్దు
మద్నూర్: పత్తి కొనుగోళ్ల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఇన్‌చార్జి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంగళవారం ఆయన జిన్నింగ్ మిల్లుల యజమానులు, పత్తి వ్యాపారులు, మార్కెటింగ్ అధికారులు, లోకల్ మానిటరింగ్ కమిటీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారంనుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభమవుతాయన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందన్నారు. వర్షాల నేపథ్యంలో తూకం ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, మార్కెటింగ్ అధికారి రమ్య, కార్యదర్శి రాజ్‌కుమార్, సీసీఐ ప్రతినిధులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు పాల్గొన్నారు.
పత్తి కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా
జరిగేలా చూడాలి
వ్యాపారులు, జిన్నింగ్ మిల్లుల
యజమానులతో ఇన్‌చార్జి కలెక్టర్
వినయ్ కృష్ణారెడ్డి


