చెడు వ్యసనాలతో భవిష్యతును కోల్పోవద్దు
కామారెడ్డి టౌన్: యువత, విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, వాటికి బానిసలుగా మారి మంచి భవిష్యత్తును కోల్పోవద్దని ప్రభుత్వ మానసిక జిల్లా వైద్యాధికారి రమణ సూచించారు. మంగళవారం వైద్య ఆరోగ్య, ఎకై ్సజ్, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాదకద్రవ్యాల నిరోధకం, మానసిక సమస్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీనేజీ వయస్సులో విద్యార్థులు చెడు వ్యసనాలకు లోనవుతారని, ఈ సమయంలో వచ్చే అవరోధాలను జయిస్తేనే అనుకున్న లక్ష్యాన్ని చేధించగలుతారన్నారు. ఎకై ్సజ్ సీఐ సంపత్ మాట్లాడుతూ.. మత్తుపదారులు వినియోగించే విద్యార్థులు, యువతపై చట్టపరంగా తీసుకునే కఠిన చర్యల గురించి వివరించారు. జిల్లాలో ఎవరికై నా మానసిక సమస్యలుంటే ఉచిత టోల్ ఫ్రీ నెంబర్, టెలి మానస్ 14416ను సంప్రదించాలని సూచించారు. సీడబ్ల్యూసీ సభ్యురాలు స్వర్ణలత, కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ఇర్ఫానా, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


