సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం
బీబీపేట: జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆపరేషన్ సిందూర్‌పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం బీజేపీ నాయకులు బీబీపేట ప్రధాన చౌరస్తాలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ.. దేశ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా సీఎం మాట్లాడటం సిగ్గుచేటని, వెంటనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. నాయకులు రంజీత్‌గౌడ్, ప్రవీణ్, సంతోష్‌గౌడ్, రవీందర్, నరేందర్, పోసు శివ, తదితరులు పాల్గొన్నారు.
తాడ్వాయి(ఎల్లారెడ్డి): బ్రహ్మాజీవాడి శివారులో గల సిద్ధేశ్వరాలయంలో ఈ నెల 5న జరిగే వార్షిక ఉత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరావాలని గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఉత్సవాలలో జపాన్ శాస్త్రవేత్త, టయోటా కంపెనీ మేనేజర్ పైడి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం, య/్ఞం, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్త బందాలతో భజన కార్యక్రమం ఉంటుందన్నారు.
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డిలో జరిగే జాతీయ రహదారి పనులకు స్థానికులు, వ్యాపారులు సహకరించాలని ఆర్డీవో పార్థసింహారెడ్డి కోరారు. మంగళవారం ఎల్లారెడ్డిలో వ్యాపార వర్గాలు, స్థానికులతో ఆయన మాట్లాడారు. పట్టణంలో జాతీయ రహదారి పనులకు సంబంధించిన పనులకు అడ్డు పడకుండా వారికి సహకరించి పట్టణ అభివృద్ధికి పాటు పడాలన్నారు. తహసీల్దార్ ప్రేమ్‌కుమార్, స్థానికులు తదితరులున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం


