వరిధాన్యం వర్షార్పణం
● ఆగం చేస్తున్న వానలు
● ఆందోళనలో రైతులు
నిజాంసాగర్/గాంధారి: రోజూ కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు ఆగం అవుతున్నారు. పంటలు తడిసిపోతుండడంతో ఆందోళన చెందుతున్నారు. మంగళవారం మహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి, నర్వ, మహమ్మద్‌నగర్, గున్కుల్, బూర్గుల్, తుంకిపల్లి గ్రామాలలో, గాంధారి మండలంలోని పలు ప్రాంతాలలో ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో రోడ్లపైన, కొనుగోలు కేంద్రాలలో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. కొన్నిచోట్ల వడ్లు కొట్టుకుపోయాయి. వడ్ల కుప్పల్లో నిలిచిన నీళ్లను తొలగించడానికి, కొట్టుకుపోయిన వడ్లను ఒక్కచోటుకు చేర్చడానికి రైతులు నానా పాట్లు పడ్డారు.
వరిధాన్యం వర్షార్పణం
వరిధాన్యం వర్షార్పణం


