‘సాక్షి స్పెల్‌బీ’తో విజ్ఞానం పెరుగుతుంది
ఖలీల్‌వాడి: ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీ పోటీ పరీక్షల ద్వారా వి ద్యార్థుల్లో విజ్ఞానం పెరుగుతుందని ఎస్‌ఎస్‌ఆర్ వి ద్యాసంస్థల చైర్మన్, తెయూ మాజీ పాలకవర్గ స భ్యుడు మారయ్యగౌడ్ అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభతోపాటు సృజనాత్మకతను వెలికితీసేందుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో మంగళవారం స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీ ప్రాథమిక స్థాయి పరీక్షలను జిల్లా కేంద్రంలోని మాధవనగర్‌లోగల ఎస్‌ఎస్‌ఆర్ డిస్కవరీ స్కూల్‌లో నిర్వహించారు. ఈ పరీక్షలకు స్కూల్ వి ద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై, ప్రతిభను పరీ క్షించుకున్నారు. ఈసందర్భంగా మారయ్యగౌడ్ మా ట్లాడుతూ.. విద్యార్థుల ప్రతిభాపాటవాలను వెలికితీయడంలో ‘సాక్షి’ ఎప్పుడు ముందంజలో ఉంటుందన్నారు. ఇలాంటి పోటీపరీక్షలో ఇతర పాఠశాలలు పాల్గొనాలనే ఆసక్తి ఉంటే 95055 14424ను సంప్రదించాలని సాక్షి బ్రాంచ్ మేనేజర్ మహేష్ తెలిపారు. ప్రిన్సిపాల్ బాలరాజు, టీచర్లు ఉన్నారు.
‘సాక్షి’ స్పెల్‌బీ పరీక్షను మొదటిసారి రాస్తున్నా. నాకు చాలా ఆనందంగా ఉంది. మా టీచర్ చాలా బాగా నేర్పించారు. నేను జిల్లా స్థాయికి ఎంపిక అవుతానని ఆశిస్తున్నా.
– దివ్యాన్స్, 6వ తరగతి, ఎస్‌ఎస్‌ఆర్ డిస్కవరీ, నిజామాబాద్
‘సాక్షి స్పెల్‌బీ’తో విజ్ఞానం పెరుగుతుంది
‘సాక్షి స్పెల్‌బీ’తో విజ్ఞానం పెరుగుతుంది


