కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.5 వేల కోట్లు కేటాయించాలి
కామారెడ్డి రూరల్: గీత కార్మికులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.5 వేల కోట్లు కేటాయించాలని టీజీఎస్ జేఎసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ ముఖ్య సభ్యుల సమావేశం జిల్లా అధ్యక్షుడు కొండగోని రవీందర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. నర్సాగౌడ్ మాట్లాడుతూ.. గౌడ కులస్తులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని, జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జనగామ జిల్లాగా నామకరణం చేయాలని కోరారు. గీత కార్మికుల ప్రమాద బీమాను రూ.10 లక్షలకు పెంచాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న టీఎఫ్‌టీ టీసీఎస్ లైసెన్స్‌లను వెంటనే ఇవ్వాలన్నారు. నాయకులు పడాల రాజేందర్ గౌడ్, తీగెల వెంకట్ గౌడ్, యాగండ్ల దశ గౌడ్, పీసర శ్రీనివాస్ గౌడ్ లు పాల్గొన్నారు.


